ఓ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కావడంతో ఆరుగురు మృతిచెందగా, 20మంది అస్వస్థతకు గురైన విషాద ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. సూరత్‌లో ఇవాళ వేకువజామున పెను విషాదం చోటు చేసుకుంది. సాచిన్ ప్రాంతంలోని ఓ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కావడంతో ఊపిరాడక ఆరుగురు మరణించారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ లీక్ కాగానే స్పృహ కోల్పోయిన 26 మంది కార్మికులను స్థానికులు అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకువచ్చారని… అయితే వారిలో ఆరుగురు మరణించారని వైద్యులు వెల్లడించారు. అయితే రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న ట్యాంకర్ పైపు నుంచి గ్యాస్ లీక్ కాగా క్షణాల్లోనే ఆ వాయువును పీల్చిన విశ్వప్రేమ్ మిల్లులోని కార్మికులు స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయినట్లు స్థానికులు వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital