ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవడంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు.పంజాబ్లోని లూధియానాలో ఘోరం ప్రమాదం జరిగింది. మరో 11 మంది స్పృహకోల్పోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను దవాఖానకు తరలించారు. ఫ్యాక్టరీ చుట్టు పక్కల ఉన్నవారిని తరలిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో జనసామర్థం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు.గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందనే విషయాన్ని కనుక్కోవడానికి 35 మంది సభ్యులు కలిగిన కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నదని ఎన్డీఆర్ఎఫ్ ఐజీ నరేంద్ర బందేలా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం నుంచి సాధారణ పౌరులను తరలించడమే తమ ప్రాధాన్యమని తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఉన్నారని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement