Wednesday, November 20, 2024

గ్యాస్ సిలిండర్​ మరింత భారం, మళ్లీ పెరిగిన ధర.. కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత

గ్యాస్​ సిలిండర్​ రీఫిల్​ ధర మళ్లీ పెరిగింది. విపరీతమైన ట్యాక్స్​లు, జీఎస్టీతో ప్రజలను కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీస్తోంది. మొన్నటిదాకా కరోనా మహమ్మారి బయటకు వెళ్లకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభత్వం జనాల బతుకులపై దాడి చేస్తోంది. ఆయిల్​ రేట్లు కేజీ 200 దాటాయి, పెట్రో రేట్లు లీటర్​ 119 దాటాయి, గ్యాస్​ రేట్లు వెయ్యి రూపాయలు దాటాయి.. ఇప్పుడు మళ్లీ రేటు పెంచింది కేంద్ర ప్రభుత్వం.. ఇట్లా ప్రతీది పెంచుకుంటూ పోవడంతో కనీసం తిండికి నోచుకునే పరిస్థితులు లేక పేదల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి.

చేయడానికి పనులు లేక, పెరిగిన ధరలతో నిత్యావసరాలు కొనుగోలు చేయలేక సామాన్యులు బెంబేలెత్తిపోయే పరిస్థితులు దాపురించాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ లీడర్లపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే జనాలు లీడర్లపై తిరుగుబాటు చేసినా చేయొచ్చు.

పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటింది. తాజా పెంపుతో ఢిల్లీ, ముంబైలో గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల సిలిండర్‌ ధర రూ.1003కు చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.5, హైదరాబాద్‌లో 1056కు పెరిగింది. ఈ నెల 7న సిలిండర్‌పై రూ.50 పెంచిన విషయం తెలిసిందే.

ఇక 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.8 పెంచడంతో రూ.2364కు చేరింది. 19 రోజుల వ్యవధిలో వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ ధర పెరగడం ఇది రెండోసారి. ఈ నెల 1న సిలిండర్‌పై రూ.102.50 భారం మోపిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement