గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడంతో 20మందికి పైగా అస్వస్థతకి గురయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు.ఈ సంఘటన ఉత్తరాఖండ్ ఉధంసింగ్ నగర్ జిల్లా కేంద్రం రుద్రాపూర్ లో చోటు చేసుకుంది. రుద్రాపూర్‌లోని ఆజాద్ నగర్ ట్రాన్సిట్ క్యాంప్ ప్రాంతంలో గ్యాస్ లీక్ జరుగుతోందన్న సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం సహాయక చర్యలు ప్రారంభించింది. 45-50 లీటర్ల సామర్థ్యం ఉన్న ఈ సిలిండర్‌ల పైప్ కట్ అవ్వడంతో గ్యాస్ లీక్ అయిందని ఎస్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ బాలం సింగ్ బజేలీ తెలిపారు. లీకేజ్ అవుతున్న సిలిండర్‌ను అటవీ ప్రాంతానికి తరలించామని, దీంతో ఎలాంటి అవంఛనీయ ఘటనలూ జరకుండా చేశామని పేర్కొన్నారు. ఈ ప్రమాదం వల్ల 20 మందికి పైగా వ్యక్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో వారందరినీ వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. కాగా.. ఈ ఘటనలో లీక్ అయిన గ్యాస్ ఏరకమైనది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement