Saturday, November 23, 2024

కరీంనగర్​లో గ్యాంగ్ స్టర్​ల వీరంగం.. సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు

కరీంనగర్ కమిషనరేట్ గా ఏర్పడిన త‌ర్వాత‌ బెదిరింపులు, హింసాత్మ‌క‌ సంఘటనలకు పాల్పడే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో గ్యాంగ్ స్టర్ ల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. మధ్యలో కరీంనవర్ నడిబొడ్డున తాళ్వార్లతో జరిగిన బర్త్ డే పార్టీ సంచలనం రేపింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలువురిని లోపలవేశారు. అల్లరి మూఖల ఆగడాలు తగ్గుముకం పట్టాయనుకుంటున్న సమయంలో గురువారం ఇంకొందరు తల్వార్ ల తో సృష్టించిన వీరంగం కలకలం రేపింది. రాజీవ్ రహదారి నుండి సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ దాబా వరకూ సాగి.. మాటా మాటా పెంచుకుని తల్వార్ లతో దాడులు చేసుకునే పరిస్థితికి వచ్చింది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం వద్ద గురువారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో దావత్ చేసుకుంటున్న క్రమంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ఓ రౌడీ షీటర్ తన అనుచరులకు ఫోన్ చేసి తల్వార్‌లు తీసుకుని రావాలని చెప్పినట్లు తెలిసింది. 

సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని దాబా హోటల్‌కు వచ్చి భోజనం చేస్తున్న వారి వద్దకు చేరుకున్న గ్యాంగ్ మళ్లీ గొడవ పడ్డారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు పెరగడంతో కారులో ఉన్న తల్వార్ తో దాడికి పూనుకున్నారు. దీంతో కరీంనగర్ పెద్దపల్లి రహదారిలో ఉన్న ఓ ప్రముఖ దాబా నిర్వహకుడి చేతికి గాయం అయినట్టు తెలసింది. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు దాబా హోటల్‌లోని సీసీ ఫుటేజ్ సేకరించారు. గురువారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు సీరియస్‌గా తీసుకోనట్టు తెలుస్తోంది. సీపీ సత్యనారాయణకు సంబంధిత పోలీసు అధికారులు త‌దుప‌రి చర్యలకు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement