హరిద్వార్ లో గంగానది తీరంలో సంప్రాదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు బిపిన్ రావత్ కుమారైలు. కృతిక, తరిణిలు వారి తల్లిదండ్రులు బిపిన్ రావత్, మధులిక్ రావత్ ల అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేశారు. తమిళనాడు నీలగిరి కొండల్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో వారు మరణించిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌ల మృతదేహాలను గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌కు తీసుకొచ్చారు. అనంతరం కామరాజ్ మార్గ్‌లోని వారి నివాసానికి తరలించారు. శుక్రవారం సాయంత్రం పూర్తి సైనికా లాంఛనాలతో బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో నిర్వహించారు. రావత్ దంపతుల కూతుళ్లు.. కృతిక , తరిణి లు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.శనివారం బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికకు చేరుకున్న కృతిక, తరిణిలు తల్లిదండ్రుల చితాభస్మాన్ని సేకరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ చేరుకున్నారు. హరిద్వార్‌లో గంగ నది తీరంలో సంప్రాదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement