Thursday, November 21, 2024

న‌ల్ల‌గా మారిన గంగాజ‌లాలు – స్నానానికి ప‌నికిరావంటోన్న జ‌నాలు

కాశీలోని మ‌ణిక‌ర్ణిక ఘాట్, గంగామ‌హాల్ ఘాట్, మీర్ ఘాట్, ద‌శాశ్వ‌మేధ ఘాట్ ల‌లో న‌దీ జ‌లాలు, స్నానానికి అనుకూలంగా లేవ‌ని తెలియ‌డంతో వాట‌ర్ కార్పొరేష‌న్ స్పందించింది. దాంతో సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపై దర్యాప్తుకి ఆదేశించింది. మురుగు నీటి పంపులు దెబ్బ తిని…విశ్వనాథ్ ధామ్ వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరిగిన సమయంలో.. మురుగునీటి పంపులు దెబ్బతిన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా మురుగునీరు గంగానదిలో కలిసిపోతున్నాయని చెప్పారు. పరిస్థితి రోజు రోజుకూ తీవ్రమవుతోందని తెలిపారు. గంగాజ‌లాలు క‌లుషిత‌మ‌వుతున్నాయ‌ని జ‌నం అంటుంటే కాలుష్య నియంత్రణ విభాగ అధికారి ఎస్​కే రాజన్ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. మురుగునీటి పంపునకు, నది కాలుష్యానికి సంబంధం లేదని చెప్పారు. సాంకేతిక కమిటీ నీటి నమూనాలు సేకరించి పరిశీలన చేపట్టిందని వెల్లడించారు. ‘ఏవైనా సాంకేతిక కారణాల వల్ల నీరు నల్లగా మారిపోయి ఉండొచ్చు. పరిశీలన జరిపిన తర్వాత ఏం జరిగిందనేది తెలుస్తుంది’ అని అన్నారు..గంగా నదిలో నీరు నల్లగా మారిపోవడం వల్ల అక్కడికి వెళ్లిన భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. నదీస్నానాలు చేయడానికి నీరు అనుకూలంగా లేవని స్థానిక పూజారి ఒక‌రు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement