దేశ రాజధాని ఢిల్లీలో ఆడాళ్లే కాదు.. ఇప్పుడు మాగాళ్లకు కూడా రక్షణ లేకుండాపోయింది. ఓ పన్నెండేళ్ల బాలుడిపై దారుణం జరిగింది. నలుగురు వ్యక్తలు కలిసి ఆ కుర్రాడిని దారుణాతి దారుణంగా కొట్టి హింసించి రేప్ చేశారు. అతని ప్రైవేట్ పార్ట్స్‌లో రాడ్ చొప్పించినట్టు డాక్టర్లు చెప్పారు. ఇక ఈ విషయమ్మీద ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మలివాల్ సీరియస్ అయ్యారు. ఇవ్వాల (ఆదివారం) సోషల్ మీడియాలో ఈ దారుణ విషయాన్ని పోస్టు చేశారు.
ఈ వ్యవహారంపై డీసీడబ్ల్యూ బృందం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని స్వామి మలివాల్ తెలిపారు. నలుగురు నిందితుల్లో ముగ్గురు పరారీలో ఉండగా.. ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల18వ తేదీన తమ బిడ్డపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులకు విమెన్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, ట్రీట్మెంట్ కొనసాగుతోందని డాక్టర్లు చెప్పారు.