ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విధులు పూర్తయ్యాక ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది సదరు యువతి. ఆ సమయంలో యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా భావించిన బైక్ డ్రైవర్ యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం డ్రైవర్, అతని స్నేహితుడు ఉద్యోగినిపై పలుమార్లు రేప్ కు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో షాబుద్దీన్, అక్తర్ అనే ఇద్దరు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
- Advertisement -