వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): పొట్ట కూటి కోసమై కూలీ పనికి బయలుదేరిన వివాహిత మహిళను కారులో మేడారం అటవీ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్ళి ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగచూసింది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమై భర్తకు తోడు నీడగా నిల్చెందుకై కూలీ పని కోసం వచ్చిన మహిళను పక్కా ప్లాన్ ప్రకారమే ట్రాప్ చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందస్తుగానే పథకం వేసుకొని వివాహిత మహిళపై లైంగిక దాడికి ఓడగట్టిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎనుమాముల ఇన్స్ పెక్టర్ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్ నగరంలోని పైడిపల్లికి చెందిన ఓ మహిళపై మేడారంలోని నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో ముగ్గురు కామాంధులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు వ్యక్తులు వీరికి సహకరించిన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 9 గంటలకు ఇంట్లో నుండి ఆరేపల్లికి సదరు వివాహిత మహిళ చేరుకొంది. అక్కడే ఉన్నరేవతి అనే మహిళతో కలసి ఉన్న సమయంలో ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన రవి తన కారులో తీసుకొని వెళ్ళాడు. కొంత దూరం పోయిన తర్వాత రేవతి అనే మహిళను దింపేశాడు. మరికొద్ది దూరం పోగానే ముగ్గురు మనుషులు కారు ఎక్కారు.
బాధితురాలైన మహిళను బెదిరించి, మేడారంలో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. జన సంచారంలేని ప్రాంతంలో ఒకరి తర్వాత మరొకరు ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు. బాధిత మహిళ ప్రాధేయ పడటంతో సదరు మహిళను ములుగు బస్టాండ్ లో బస్సు ఎక్కించి జారుకున్నారు. ములుగు రోడ్డులో దిగిన మహిళ తన భర్తకు ఫోన్ చేసి, రాగానే అతనితో ఇంటికెల్లింది.
భార్య రాకపై అనుమానం వచ్చి నిలదీశాడు. కానీ తనపై జరిగిన ఆఘత్యం విషయం చెబితే, తన కాపురంలో చిచ్చు రగులుతుందని భయపడి , కరీంనగర్ లోని తన తల్లిగారింటికి వెళ్లినట్లు చెప్పింది.
కానీ కామాంధుల నుండి మళ్లీ ఎటువంటి ప్రమాదం పొంచుకొస్తుందొనని గత నెల 29న, మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సదరు పోలీసులు ఏనుమాముల పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయాలని సూచించడంతో లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన సంపంగి రవి, చల్వాకికి చెందిన దున్నపోతుల నాగరాజు, హన్మకొండ పాత డిపో ప్రాంతానికి చెందిన బొంత లక్ష్మణ్, ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన ఆలకుంట్ల రమేష్, వర్ధన్నపేట ఫిరంగి గడ్డ కు చెందిన ఓర్సు సుధాకర్ లను నిందితులుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.