Saturday, November 23, 2024

బాలికపై గ్యాంగ్ రేప్, మర్డర్.. ఓ లీడర్ కుమారుడి బర్త్​ డే పార్టీలో ఘాతుకం

ఓ 14ఏళ్ల బాలికపై దారుణం జరిగింది. టీఎంసీ లీడర్ కుమారుడి బర్త్డే పార్టీకి ఆ బాలికను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు దుండలు. ఈ ఘటనలో టీఎంసీ లీడర్ కుమారుడు బ్రజ్ గోపాల్ (21) ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా.. ఆమె మరణానికి కారణమయ్యారు. అంతటితో ఆగకుండా ఈ విషయం బయటకి తెలిస్తే జైలుకెళ్లాల్సి వస్తుందని ఎవరికీ తెలియకుండా స్థానిక శ్మశాన వాటికలో దహనం చేయించారు. ఇప్పుడీ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబీఐ ఎంక్వైరీ చేస్తోంది. ఇప్పటికే ఘటనకు కారకులైన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగిన అత్యాచారం, హత్య కేసు సంచలనం రేపుతోంది. మైనర్ బాలికను దహనం చేసిన శ్మశానవాటికను మీడియా బృందాలు సందర్శించాయి. అయితే అక్కడ క్రిమియేషన్ చట్టవిరుద్ధంగా నిర్వహించినట్టు మీడియా వర్గాలు గుర్తించాయి. నదియా అత్యాచార బాధితురాలి తండ్రి ఒత్తిడితో మైనర్ బాలికకు దహన సంస్కారాలు చేశారని పేర్కొన్న తర్వాత, బాధితురాలి కుటుంబానికి 200 మీటర్ల దూరంలో ఉన్న శ్మశానవాటికను మీడియా టీమ్ సందర్శించింది. కాగా, అక్కడ దహనం చేసిన వారి గురించి ఎటువంటి రికార్డులు లేవు. ఒక వృద్ధురాలు శ్మశానవాటికలో ఉంటుంది. దహన సంస్కారాలకు సంబంధించిన దాఖలాలు లేవు. వివరాలను గమనించడానికి కార్యాలయం లేదు. ఈ శ్మశానవాటికను 2015లో నిర్మించారు, దీనిని గ్రామస్తులు ఉపయోగిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి శ్మశాన వాటిక నిర్వహణపై కమిటీ వేసిన ఆచూకీ లభించలేదని స్థానికులు తెలిపారు.

ఈ కేసును సీబీఐకి అప్పగించే ముందు దర్యాప్తు చేస్తున్న పశ్చిమ బెంగాల్ పోలీసు వర్గాలు, విచారణ సమయంలో, ప్రధాన నిందితుడు బ్రోజో గయాలీ తమ ఇంటిలోని ఏ గదిలో మైనర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారో వెల్లడించినట్లు తెలిపారు. అప్పటికే ఆ గదిలో రక్తపు గుర్తులు ఉన్న బెడ్‌షీట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు శ్మశానవాటికలో ఉన్న బూడిద నుండి మూడు చిన్న మానవ ఎముకలను కూడా సేకరించారు. ఈ నమూనాలను సీబీఐకి అప్పగించనున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సిఎఫ్‌ఎస్‌ఎల్) దర్యాప్తు నేరాన్ని నిర్ధారించడానికి ఈ దర్యాప్తులో సహాయపడుతుందని వర్గాలు తెలిపాయి.

నదియా మైనర్ రేప్ కేసు
ఏప్రిల్ 4 రాత్రి స్థానిక TMC నాయకుడు సమర్ గోలా కుమారుడు బ్రజ్ గోపాల్ గోలా (21) పుట్టినరోజు వేడుకకు వెళ్లిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆమె ఏప్రిల్ 5న మరణించింది. బాధితురాలి కుటుంబం మృతదేహంతో ఆందోళన చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓ లీడర్ కుమారుడు బ్రజ్ గోపాల్ గోలా (21)గా తేల్చారు. కాగా, బాలిక డెడ్బాడీని స్థానిక తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ నాయకుడి ఒత్తిడి మేరకు శవపరీక్ష చేయకుండానే దహనం చేశారు. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత (ఏప్రిల్ 10) పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసుపై ఏప్రిల్ 12న కలకత్తా హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో విచారణకు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌లోని నదియా సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న TMC నాయకుడు సమర్ గోలా కుమారుడు బ్రజ్ గోపాల్ గోలా (21) ఏప్రిల్ 12న అరెస్టు అయ్యాడు. బ్రజ్ గోపాల్ గోలా వాంగ్మూలం ఆధారంగా రెండవ నిందితుడు ప్రభాకర్ పొద్దార్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement