పూరాతనమైన పోలో వ్యూ మార్కెట్ కొత్త కాంతిని సంతరించుకుంది. ఈ మార్కెట్ 70ఏళ్ల పాతతి. జమ్ము కశ్మీర్ లో ఉంది ఈ మార్కెట్. సరికొత్త మెరుగులు అద్దుకుని యూరప్ దేశాల్లోని వీధులకు తగ్గకుండా ఆకర్షిస్తుంది. టూరిస్టులకు, స్థానికులకు ఫ్యాషనేబుల్ షాపింగ్ సెంటర్‌గా ఉన్న ఈ వీధి ఇప్పుడు తళుకులీనుతున్నది. వచ్చే వారం ఇక్కడ జీ 20 సమావేశం జరుగుతున్న తరుణంలో ఈ వీధి సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ మార్కెట్ దాల్ లేక్ సమీపంగానే ఉంటుంది. ఆల్ ఇండియా రేడగియో, దూరదర్శన్ కేంద్ర, మ్యూజియం వంటి ముఖ్యమైన భవంతులూ ఇదే లైన్‌లో ఉంటాయి. జీ 20 సమావేశానికి కేంద్రమైన షేర్ ఎ కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కేఐసీసీ)కి వెళ్లే దారి మధ్యలోనే ఈ మార్కెట్ ఉంటుంది. న్యూఢిల్లీలో నవంబర్ నెలలో నిర్వహించబోయే జీ 20 సదస్సుకు కావాల్సిన అజెండాను కశ్మీర్‌లో జరిగే సమావేశంలో ఖరారు చేస్తారట.
మెరుగులు దిద్దిన పోలో వ్యూ మార్కెట్ ఇప్పుడు కొత్త అందాలను సంతరించుకుని సెల్ఫీ పాయింట్‌గా మారిపోయింది. చాలా మంది ఇక్కడికి రిలాక్స్ కావడానికి వచ్చి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. శ్రీనగర్ నడిబొడ్డులో ఉండే పోలో వ్యూ మార్కెట్‌ను ఒక పాదాచారుల వీధిగా మార్చామని, ఈ హంగులు మరింత మంది పర్యాటకులను ఆకర్షిస్తాయని చెప్పారు. తద్వార రిటేల్ సేల్ పెరగడంతోపాటు పర్యాటకులూ ఈ ప్రాంతాన్ని చూసి ముగ్దులవుతారని వివరించారు. శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్, సీఈశో ఆఫ్ శ్రీనగర్ స్మార్ట్ సిటీ అథర్ అమీర్ ఖాన్ పోలో వ్యూ మార్కెట్ చిత్రలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇలాంటి చర్యలు ఇంకొన్ని తీసుకుంటామని, దీనిపై ఓ ప్రణాళికే ఉన్నదని తెలిపారు. దేశంలోని మహా నగరాలకు పోటీగా కశ్మీర్‌లోనూ నగరాలను తీర్చిదిద్దుతామని చెప్పారు. రెసిడెన్సీ రోడ్, లాల్ చౌక్, ఓల్డ్ సిటీల్లోని మార్కెట్‌ల తరహాలోనే పోలో వ్యూ మార్కెట్‌ను కూడా అభివృద్ధి చేస్తామని వివరించారు.ఈ సుందరీకరణలో చినార్, ఇతర చెట్ల మొదళ్లను కవర్ చేయకపోవడం తనకు నచ్చిందని ఓ యూజర్ పేర్కొన్నాడు.