Saturday, November 23, 2024

జి-23 కాంగ్రెస్‌లో భాగమే.. గాంధీ ఫ్యామిలీని టార్గెట్‌ చేయట్లే.. బీజేపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యం..

అసమ్మతి గ్రూప్‌ ఆఫ్‌ 23 (జీ-23) కాంగ్రెస్‌లోని తిరుగుబాటు వర్గం కాదని, పార్టీలోనే భాగమని సీనియర్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ శనివారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మణిశంకర్‌ అయ్యర్‌ ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత గాంధీ కుటుంబ విధేయుడైన తాను జీ-23 గ్రూపులో చేరినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో మణిశంకర్‌ అయ్యర్‌ ఈ ప్రకటన చేశారు. అయితే, జీ-23- కాంగ్రెస్‌ హైకమాండ్‌ మధ్య ప్రతిష్టంభన ఏర్పడుతుందనే ఊహాగానాలను అయ్యర్‌ తోసిపుచ్చారు. కూటమి గాంధీల వెంట వెళ్లడం లేదని స్పష్టంచేశారు. జీ-23 కాంగ్రెస్‌లోని ఫ్యాక్షన్‌ కాదు. ఫ్యాక్షన్‌ కథనం మీడియా కల్పితం. మేము కాంగ్రెస్‌లో భాగమే. జి-23 లక్ష్యం గాంధీ కుటుంబం కాదు, మా లక్ష్యం బీజేపీ” అని ఆయన స్పష్టంచేశారు.

చర్చలు సానుకూలం..
జీ-23 నాయకులు, గాంధీ కుటుంబ సభ్యుల మధ్య ఇటీవలి సమావేశాలు ప్రోత్సాహకరంగా జరిగాయని, పార్టీ పనితీరుకు సంబంధించి సిఫార్సులు పరిశీలనలో ఉన్నాయని అయ్యర్‌ చెప్పారు. రాహుల్‌తో జీ-23 సభ్యుడు భూపిందర్‌ సింగ్‌ హుడా సమావేశమయ్యారు. గులాంనబీ ఆజాద్‌ శుక్రవారం తన నివాసంలో కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ విషయానికొస్తే, ఇది చాలా సామరస్యపూర్వకమైన, నిర్మాణాత్మకమైన వ్యాయామం అని అయ్యర్‌ తెలిపారు. మా సూచనలన్నీ కాంగ్రెస్‌ రాజ్యాంగంపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.

మా లక్ష్యం బీజేపీయే..
ఇటీవలి సంవత్సరాలలో పార్టీలో కొన్ని బలహీనతలు చోటుచేసుకున్నాయని అంగీకరించిన అయ్యర్‌, రాబోయే ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనే స్థితిలో కాంగ్రెస్‌ లేదని కూడా అన్నారు. నాయకత్వ సమస్యను పక్కదారి పట్టిస్తూనే సంస్థాగత సమగ్రత మాత్రమే పరిష్కారమని పేర్కొన్నారు. ”బీజేపీని నిలువరించాలి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఆమేర శక్తిసామర్థ్యాలు లేవన్నది వాస్తవం. గత ఏడెనిమిదేళ్ల కాలంలో మా పార్టీలో ఏర్పడిన ఈ స్పష్టమైన బలహీనతల నేపథ్యంలో మరింత బలపడాల్సిన అవసరం ఉంది’ అని అయ్యర్‌ చెప్పారు.

జి-23 డిమాండ్లు ఏమిటి?
వరుస ఎన్నికల వైఫల్యాలు, క్షీణిస్తున్న పార్టీ ప్రాభవం గురించి 2020లో సోనియా గాంధీకి మొదటిసారి లేఖ రాసినప్పటి నుండి పార్టీ పునర్నిర్మాణం కోసం జీ-23 పట్టుదలగా ప్రయత్నిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోయే నాయకత్వం, అన్ని స్థాయిలలో నిర్ణయం తీసుకునే వాతావరణం ఉండాలని అయ్యర్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement