కన్న తల్లిదండ్రులనే రోడ్డుపై వదిలివెళ్తున్నారు పలువురు. కనీసం తల్లిదండ్రుల అంత్యక్రియలకి వచ్చే సమయం కూడా లేనంతగా వ్యవహరిస్తున్నారు కొందరు. అలాంటిది రోడ్డుపై యాచకుడి అంత్యక్రియలకి జనం తండోపతండాలుగా వచ్చారు. ఎక్కడో తెలుసా. కర్ణాటకలోని విజయ్‌నగర్ జిల్లా హడగలి పట్టణంలో.. బస్యా (45) అనే వ్యక్తి ఓ యాచకుడు.. రూపాయి కంటే ఎక్కువ ఇస్తే అదనపు మొత్తాన్ని తిరిగి ఇచ్చేవాడట. బలవంతం చేసినా ఎక్కువ డబ్బు తీసుకోడని స్థానికులు తెలిపారు. బస్యాకు అన్నదానం చేస్తే అదృష్టం వస్తుందని స్థానికులు నమ్మారు. ఆయన ఏం మాట్లాడినా అది నిజమేనని, అందుకే ఆయనపై ప్రజల్లో గౌరవం ఉందని స్థానికుడు తెలిపారు.కాగా బస్యాని బస్సు ఢీకొట్టడంతో.. ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అతడు చనిపోయాడు. అతని అంతమ సంస్కారాలకు వేలాది మంది తరలి వచ్చారు. బస్యా అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతని పట్ల తమకున్న గౌరవాన్ని తెలియజేయడానికి వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అతని పార్థివదేహాన్ని ఆర్టీరియల్ రోడ్డుపై అంతిమయాత్రని నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily