Tuesday, November 26, 2024

Fun Day: షేర్ షా.. కార్గిల్ వీరుడి రియల్ స్టోరీ

సిద్ధార్థ్ మల్హోత్రా ఫిలిం కెరీర్ లో ది బిగ్గెస్ట్ అచ్చీవ్ మెంట్ అంటే అది ఈ షేర్ షా మూవీనే అని చెప్పొచ్చు. ఏక్ విలన్ మూవీ తప్పా మిగతావన్నీ సిద్ధార్థ్ కి సరిగ్గా కలిసి రాలేదు. స్పై గా అండ్ బాక్సర్ గా ఇలా న్యూ రోల్స్ చేసినా అవి అనుకున్న సక్సెస్ ఇవ్వలేకపోయాయి. కానీ, ఈ షేర్ షా సినిమాలో తను అమేజింగ్ అండ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, తమిళ డైరెక్టర్ విష్ణువర్దన్ డైరెక్షన్.. ఈ బయోగ్రఫికల్ వార్ ఫిలిమ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లాయి..

కార్గిల్ వార్ లో వీరమరణం చెందిన పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విక్రమ్ భాత్రా బయోఫిక్ ఫిల్మ్ ఇది. విక్రమ్ చైల్డ్ హుడ్ నుంచి స్టోరీ స్టార్ట్ చేసి, తన డ్రీమ్ అయిన ఆర్మీలో జాయిన్ అవడం, చాలెంజెస్ ఫేస్ చేసి మిషన్స్ ని సక్సెస్ ఫుల్ గా టేకప్ చేయడం.. చివరికి కార్గిల్ వార్ లో తన టీమ్ తో చేసిన తన చివరి యుద్ధంని కళ్లకు కట్టినట్టు చూపించారు.

ఇండియాస్ బెస్ట్ బయోపిక్ లో ఇది కచ్చితంగా ఉండిపోతోంది. ఆ విధంగా విష్ణువర్ధన్ డైరెక్షన్ కానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇంప్రెసివ్ పర్ఫామెన్స్ తో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా  పర్ఫెక్టుగా సెట్ అయ్యాయి. ఆర్మీ సోల్జర్స్ చేసే ధైర్య సాహసాలు, వాళ్ల తెగింపు, దేశం కోసం చివరికి వీరమరణం పొందినా సరే వార్ లోకి దూకటం.. చూసేవారికి ఒక్కసారిగా ఏదో తెలియని ఫీల్ వస్తుంది. ఎమోషనల్ గా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోతాము.

మూవీ చివరలోని ఆ 30 నిమిషాల వార్ సీక్వెన్స్ అయితే అందరినీ ఏడిపివ్వడం ఖాయం. ఏ దిల్ మాంగే మోర్ అనే చాలెంజింగ్ డైలాగ్ కి సూటయ్యే విధంగా మూవీ ఉంటుంది. ఈ సినిమా ప్రైమ్ వీడియోస్ లో ఉంది.. చూసి ఎంజాయ్ చేయండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement