నాగబాబు కూతురు నిహారికా ప్రొడ్యూసర్ గా పింక్ ఎలిపెంట్స్ సొంత ప్రొడక్షన్ హౌస్ తో కొన్ని వెబ్ సిరీస్ లు చేశారు. దాంట్లో ఒకటైన మ్యాడ్ హౌస్ అనే తెలుగు సిట్ కామ్ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసిన మహేశ్ ఉప్పలతో మళ్లీ కొలాబరేట్ అయి ఒక చిన్న ఫ్యామిలీ వెబ్ సిరీస్ తో ముందుకొచ్చారు.
జీ5లో స్ట్రీమ్ అవుతున్న ఒక చిన్న ఫ్యామిలీ వెబ్ సిరీస్ లో 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది డీసెంట్ వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు. అయితే కొంత లాగ్ ఉండడం గమనించొచ్చు. ఇంతకీ మెయిన్ ప్లాట్ ఏంటంటే.. లేజీ ఇంకా స్టీడీస్ లో వీక్ అయిన మహేశ్ కి అప్పటి వరకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ గా ఉన్న వాళ్ల నాన్న చనిపోయాక పాతిక లక్షల అప్పు చేశాడని తెలుస్తుంది. ఇంక తర్వాత తను, తన మదర్ ఈ ప్రాబ్లం నుంచి ఎలా ఫేస్ చేశారనేది స్టోరీ.
పిల్లలు పుట్టాకా వారే తల్లీదండ్రులకు ఎలా సర్వస్వం అవుతారు.. ఇంకా పిల్లల కోసం వారు చేసే శాక్రీఫైస్ ని ఈ సిరీస్ లో చూడొచ్చు.. ఒక మదర్ అండ్ సన్ రిలేషన్ షిప్ ని ఎంటర్ టైనింగ్ గా చూపించారు. ఫస్ట్ అండ్ ఫైనల్ అయిన ఫిఫ్త్ ఎపిసోడ్స్ అయితే టూ గుడ్ ఉన్నాయి. కానీ, మధ్యలో ఉన్న ఎపిసోడ్స్ అయితే సో సో గానే అనిపిస్తాయి.
ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నంత సేపు ఫేస్ లో ఒక స్మైల్ ఉంటుంది. ఇది అందరికీ అంతలా కనెక్ట్ అవుతుంది. ఇక లాస్ట్ ఎపిసోడ్ లో మంచి ఎమోషన్ ఉంటుంది. మధ్యలో ఎపిసోడ్స్ లో డ్రామా ఎక్కువుంటుంది. అయితే అంతగా కనెక్ట్ అవ్వలేదు కానీ, ఫ్లోలో వెళ్తుంటాయి. స్టోరీ అంతా వరంగల్ బ్యాక్ డ్రాప్ లో రన్ అవుతుంది. అండ్ అక్కడక్కడ రఘువరన్ బి. టెక్., మూవీ గుర్తుకు వస్తుంటుంది.
ఇక పర్ఫామెన్స్ లోకి వస్తే.. సంతోష్ శోభన్ బ్రదర్ అయిన సంగీత్ శోభన్ ది బ్రేకర్ అండ్ ది బ్యూటీ తర్వాత ఈ సిరీస్ తో మెయిన్ లీడ్ గా డెబ్యూ ఇచ్చారు. యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అండ్ టైమింగ్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేసినట్టు యాక్టింగ్ నేచురల్ గా ఉంది. మదర్ గా యాక్ట్ చేసిన తులసి కూడా ఈ సిరీస్ లో చాలా బాగా ఉన్నారు. తన పాత్రకి 100శాతం ఇచ్చారనే చెప్పవచ్చు.
కొన్ని ఎపిసోడ్స్ లో మహేశ్ ఉప్పల బ్రలియన్స్ కనిపిస్తుంది. ఎస్పెషాల్లీ కామెడీ పార్ట్ అయితే ఆర్గానిక్ గా తీశారు. సినిమాటో గ్రఫీ, ప్రొడక్షన్స్ క్వాలిటీ వెబ్ సిరీస్ రేంజ్ కి రిచ్ గానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కొన్ని ఎపిసోడ్స్ లో లాగ్ ఉండడం మినహా అంతా బాగానే ఉంటుంది.. ఇదిప్పుడు జీ5లో స్ట్రీమ్ అవుతోంది చూసి ఎంజాయ్ చేయండి..
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..