మస్ట్ వాచ్డ్ తెలుగు డబ్బుడు మూవీస్.. ఈ తెలుగు డబ్బుడు మూవీస్ ఒక్కోటి ఒక్కోలా ఉంటాయి. సర్వైవల్ ఎమోషనల్ కనెక్టివిటీతో పాటు అదిరిపోయే యాక్షన్ అడ్వెంచరస్ మూవీస్ కూడా ఉన్నాయి. కొన్ని రీసెంట్ గా వచ్చినవి అయితే మరికొన్ని చాలా రోజుల క్రితం రిలీజ్ అయినవాటిని తెలుగులో డబ్ చేసి వదిలారు.
డియర్ సారా..
క్యామెల్ ఇంకా దాన్ని పెంచుకుంటున్న ఓనర్ మధ్య ఉన్న రిలేషన్ షిప్ చుట్టూ ఈ మూవీ ఉంటుంది. క్యామెల్‌ని ఒక ప్రామినెంట్ రోల్‌లో ప్రెజెంట్ చేసిన ఇండియాస్ ఫస్ట్ మూవీ ఇది. తమిళనాడులో యాక్సిడెంటల్‌గా హీరో ఒక చిన్న క్యామెల్‌ని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటాడు. దానికి సారా అని పేరు పెట్టుకుంటారు. ఫ్యామిలీతో అది క్లోజ్ అయ్యాకా..ఒక సిచ్యుయేషన్‌లో సారాని రాజస్థాన్ పంపిద్దామని అనుకోగా ఎలాంటి ట్రబుల్స్ వచ్చాయనేది మూవీలో చూడొచ్చు. మనం ప్రేమగా పెంచుకున్న ఏ యానిమల్ అయినా అది దూరమవుతుంటే ఎంత బాధగా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. పర్ఫెక్ట్ టైమ్‌లో సరైన మ్యూజిక్ పడడంతో మూవీలో ఇంకా బాగా ఇన్‌వాల్వ్ అవుతాము. ప్రతి సీన్‌లో మెయిన్ లీడ్‌కి తన అగ్రికల్చర్ ల్యాండ్ మీద, కూతురు మీద, ఇంకా యానిమల్స్ మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. ఇది చూశాక అందరూ అనుకుంటారు గొప్ప సినిమాగా తప్పకుండా ఫీల్ అవుతారు.. ఇది బక్రిద్ అనే తమిళ మూవీకి తెలుగు వర్షన్.. మూవీ చూశాక బక్రిద్ అని ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. ఇది ప్రస్తుతం యూట్యూబ్‌లో ఉంది ఫ్రీగానే చూడొచ్చు..
చుంబక్..
రిలీజ్‌కి ముందే ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్‌లో స్ర్రీనింగ్ అయ్యి.. ఎన్నో అవార్డులు గెలిచిన ఈ చుంబక్ మూవీ నచ్చడంతో అక్షయ్ కుమార్ ప్రజెంటర్‌గా వ్యవహరించి ఈ సినిమాని రిలీజ్ చేశారు. స్టోరీ ఏంటంటే.. ముంబయి హోటళ్లో పనిచేస్తున్న బాలు.. మనీ కోసం తన ఫ్రెండ్ అయిన డిస్కోతో కలిసి ఫ్రాడ్ లాటరీ ఎస్ఎంఎస్‌లో స్కీంలో ఇన్వాల్వ్ అవుతాడు. ఈ వలలో పడ్డ మెంటల్లీ చాలెంజ్‌డ్ పర్సనైన ప్రసన్నాని ఎలా మోసం చేస్తారు.. తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ చుట్టూ మూవీ ఉంటుంది. మంచి మనసున్న వాళ్లు తమ స్వార్థ్యం కోసం ఎదుటి వారికి హానీ చేద్దామని అనుకున్నా ఫైనల్‌గా అలా చేయలేరు అనేది ఈ మూవీ చెబుతుంది. ఒక డిఫరెంట్ మూవీ చూస్తున్న ఫీల్ వస్తుంది. ఇంకా క్లైమాక్స్‌లో మంచి ఎమోషన్ జనరేట్ అవుతుంది. ఈ మరాఠి మూవీ తెలుగు డబ్బుడు వర్షన్ సోనీ లివ్‌లో ఉంది..
కసడ తపరా..
డైరెక్టర్ చింబు దీవన్ తీసిన ఈ మూవీ.. సిక్స్ స్టోరీస్ హైపర్‌లింక్ అనే ఒక రేర్ అటెంప్ట్‌ని వెరీ ఇంట్రస్టింగ్ మ్యానర్‌లో ప్రెజెంట్ చేశారు. సిక్స్ స్టోరీస్‌ని ఒకదానికి ఒకటి కనెక్ట్ చేయడం.. అందులోనూ డీటేయిల్డ్ స్టోరీ టెల్లింగుతో కలర్ క్యాటగైరైజేషన్. బట్టర్‌ఫ్లై ఎఫెక్ట్‌ని ఉపయోగించడం యూనిక్ అటెంప్ట్ అని చెప్పొచ్చు.. ప్రతి స్టోరీ ఎండింగ్ ఆ తర్వాత స్టోరీ బిగినింగ్‌కి అందులోని టర్నింగ్ పాయింట్‌కి కారణమవుతుంది. మనుషుల్లోని రకరకాల ఎమోషన్స్ ని కూడా డిస్ర్కైబ్ చేస్తుంది. సోనీ లివ్‌లో ఉంది తప్పకుండా చూడండి..
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..