కన్నడలో పోయిన సంవత్సరమే రిలీజై పెద్ద హిట్టు కొట్టింది దియా సినిమా. దాన్నే యూట్యూబులో కూడా తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీకి రీమేక్ గా డియార్ మేఘా అని తెలుగులో కూడా ఈ మధ్యనే వచ్చింది. ఇక ఒరిజినల్ తెలుగు డబ్బుడ్ కనుక చూసుకుంటే జనరల్ గా తెలుగు డబ్ డు సౌతిండియన్ మూవీస్ లో క్యారెక్టర్ నేమ్స్, లొకేషన్ నేమ్స్ మారుస్తారు. కానీ, దీంట్లో అలా కాకుండా ఒరిజినల్ వాటినే యూజ్ చేశారు.
దియా అనే ఇంట్రావర్ట్ అమ్మాయి తన కాలేజీ క్రష్ అయిన రోహిత్ ని చూస్తూనే ఉంటుంది కానీ, మాట్లాడలేకపోతుంది. కాలేజీ తర్వాత తన లైఫ్ అండ్ లవ్ ఎలా మారుతాయి.. ఆ తర్వాత వచ్చే ఆది అనే క్యారెక్టర్ ఎవరు అనేది మూవీలో చూడొచ్చు. సినిమాలో వచ్చే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ ప్రైజెస్ ఆఫ్ మిరాకిల్స్ అనే కోట్ లాగానే చాలా సర్ ప్రైజింగ్ ట్విస్టులుంటాయి.
చాలా సీన్స్ ఎమోషనల్ అయ్యే విధంగా ఉంటాయి. ఫస్టాఫ్ మిడిల్ నుంచి వచ్చే ఆది క్యారెక్టర్ గుడ్ ఆటిట్యూడ్ అలాగే వాళ్ల అమ్మతో ఉండే బాండింగ్ చాలా బాగుంటుంది. సినిమా చూశాక మూవీస్ ఫేవరేట్ క్యారెక్టర్ గా మారుతుంది. తెలుగు డబ్ యూట్యూబ్ లో ఉంది.. డోంట్ మిస్ ఇట్..
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..