కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పాదయాత్ర ఇవ్వాల (ఆదివారం) 11వ రోజు ఉత్సాహంగా ముగిసింది.. కేరళలోని హరిపద్ నుంచి ఈ యాత్ర కొనసాగించారు. కాగా, ఈ రోజు రాహుల్ యాత్రలో ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం జరిగింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న రాహుల్.. ఒక్కసారిగా ఆగిపోయారు. ఎందుకంటే తన ముందు నడుస్తున్న ఓ చిన్నారి కాలి చెప్పు ఊడిపోయి ఇబ్బంది పడుతోంది.. దీన్ని గమనించిన రాహుల్ ఆ పాప దగ్గరకు వెళ్లి, కాలి చెప్పును సరిచేశారు.
దీనికి సంబంధించిన వీడియోను భారత్ జోడో అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌ని కాంగ్రెస్ మహిళా విభాగం తాత్కాలిక అధ్యక్షురాలు డిసౌజా రీట్వీట్ చేస్తూ.. ‘‘నిరాడంబరత, ప్రేమ, దేశాన్ని సమైక్యంగా ఉంచాలంటే రెండూ అవసరం”అని కామెంట్స్ పెట్టారు. దీన్ని చాలామంది లైక్ చేస్తూ.. పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక.. సాదాసీదా వ్యక్తిగా రాహుల్ గాంధీ అందరితో కలిసి ముందుకు సాగుతుండడంపై కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది.