చిరకాల ప్రత్యర్థి పాక్‌పై విక్టరీ సాధించిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా దీపావళి ఒక రోజు ముందు ఆడిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. ఇప్పుడు అదే ఊపు మీద ఉన్న టీమిండియా నెదర్లాండ్స్‌తో గురువారం మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో తమ తొలి నెట్ సెషన్‌ను పూర్తి చేశారు.
ఈ ప్రాక్టీసులో బౌలర్లు తీవ్రతతో ఆడారు. అశ్విన్ చాహల్ బౌలింగ్‌లో రాహుల్ దినేష్ కార్తిక్ బంతులను ఎదుర్కొన్నారు. అలాగే కార్తి, కోహ్లీ కలిసి త్రో డౌన్స్ ప్రాక్టీస్ చేశారు. పంత్ కూడా నెట్స్‌లో మంచి షాట్లు ఆడుతూ కనిపించాడు. మొత్తంగా ఈ ప్రాక్టీస్ సెషన్ అంతా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ పర్యవేక్షణలో జరిగింది.
టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్(వికెట్ కీపర్, హార్థిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ.