Monday, November 11, 2024

నాన్ స్టాప్ బాదుడు.. రూ.110కి చేరువలో పెట్రోల్ ధర

దేశంలో చమరు ధరలు భగభగ మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. చమరు సంస్థలు పెట్రోల్, డీజిల్ పై 35 పైసలు పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 35 పైసలు పెరిగి రూ. 105.49కి చేరింది. లీటర్ డీజిల్ ధర 35 పైసలు పెరుగుదలతో రూ. 94.22కి చేరింది. ముంబైలో పెట్రోల్ రూ. 111.43 (రూ.0.34పెరిగింది), డీజిల్ రూ.102.15 (రూ.0.37 పెరిగింది)గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ. 106.10 (రూ.0.34పెరిగింది), డీజిల్ రూ. 97.33 (రూ.0.35 పెరిగింది)కి చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ .102.80 (రూ.0.30పెరిగింది)& డీజిల్ రూ. 98.69 (రూ.0.33పెరిగింది)గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 36 పైసలు పెరిగి రూ.109.73కి చేరగా.. డీజిల్‌ లీటర్ రూ.102.80కి పెరిగింది.

ఇది కూడా చదవండి: మరో సర్జికల్ స్ట్రైక్స్ తప్పదు: పాక్ కు అమిత్ షా వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement