దేశంలో పెట్రో ధరలు భగభగ మండుతున్నాయి. ప్రతిరోజు ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్న చమరు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ పై 35 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 108.64కి చేరగా.. లీటర్ డీజిల్ రూ. 97.37కి చేరింది. ముంబైలో పెట్రోల్ రూ. 114.47, డీజిల్ రూ .105.49కి పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ. 109.02 ఉండగా.. డీజిల్ రూ. 100.49కి ఎగసింది. చెన్నైలో పెట్రోల్ రూ .105.43, డీజిల్ రూ. 101.59గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.113.00 చేరింది. డీజిల్ లీటర్ రూ.106.22కి పెరిగింది. భోపాల్ పెట్రోల్ ధరల రికార్డ్ స్థాయిలో రూ.117.35కి చేరగా.. డీజిల్ రూ.106.76కి ఎగసింది.
ఇది కూడా చదవండి: ఆర్‌బీఐ గవర్నర్‌గా మళ్లీ శక్తికాంత్ దాస్