దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గ్యాస్ ధరలను పెంచినా.. చమరు ధరలను మాత్రం ఆయిల్ కంపెనీలు పెంచలేదు. గడిచిన నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, డీజిల్ ధర 105.49గా స్థిరంగా ఉంది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67 వద్ద కొనసాగుతోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51, డీజిల్ ధర రూ.104.77 ఉండగా.. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.09, డీజిల్ ధర రూ.94.79 వద్ద కొనసాగుతన్నాయి. కాగా, 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మొదలైయ్యయి. దాదాపు రూ.10పైన పెరిగాయి. అయితే, ఏప్రిల్ 6 నుండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
ధరల సవరణ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.