ఫోన్ డ్యామ్ లో పడిపోయినందుకు 21లక్షల లీటర్ల నీటిని తోడించారు ఓ అధికారి. కాగా ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ లో నాలుగు రోజుల క్రితం వెలుగు చూసింది.. ఈ ఘటనలో అక్కడి ప్రభుత్వం ఆ అధికారికి షాక్ ఇచ్చింది. 21 లక్షల లీటర్ల నీటికి డబ్బులు అతని నుంచి వసూలు చేయాలని తెలిపింది. దానికోసం జీతంలో నుంచి ఎందుకు కోత విధించవద్దని ప్రశ్నించింది. ఛత్తీస్‌గఢ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు.. డ్యామ్ లో పడిపోయిన తన ఖరీదైన ఫోన్‌ను రికవరీ చేయడానికి రిజర్వాయర్ నుండి 21 లక్షల లీటర్ల నీటిని తోడేశాడు. ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో అతడిని సస్పెండ్ చేశారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత, ఆ ఫుడ్ ఇన్స్ పెక్టర్ తనను నీటిని తోడడానికి మౌఖిక అనుమతులు ఇచ్చాడని చెప్పిన సీనియర్ అధికారిని తెరమీదికి తెచ్చింది ప్రభుత్వం.
Advertisement
తాజా వార్తలు
Advertisement