Friday, November 22, 2024

Fashion: దిశాపటాని నుంచి రకుల్​ ప్రీత్​ సింగ్​ వరకు.. ఈవారం సెలబ్రిటీల ఫ్యాషన్​ మూమెంట్స్​!

ఫ్యాషన్ అండ్​ సెలబ్రిటీలను వేర్వేరుగా చూడలేం.. ఫ్యాషన్​తో పెనవేసుకున్న అనుబంధం వీరిది. ప్రపంచంలోని బెస్ట్​, బిగ్గెస్ట్​ కోచర్ డిజైనర్‌లలో కొందరు తమ క్రియేషన్‌ని.. వారికి అనుబంధంగా ఉన్న సెలబ్రిటీలతో కలిసి కొత్త కొత్త డిజైనర్​ వేర్స్​ని లాంచ్​ చేయడానికి ట్రై చేస్తుంటారు. దేశంలోని మనీష్ మల్హోత్రా, సబ్యసాచి వంటి వారు కానీ, లేదా విదేశాల్లో వెర్సేస్, లూయిస్ విట్టన్ కావచ్చు ఇట్లా తమ డిజైనర్ బ్రాండ్స్​ని గ్రాండ్​గా ప్రదర్శించడానికి ట్రై చేస్తుంటారు. ఇక.. నటీనటులు, మోడల్స్​, కళాకారులు, పారిశ్రామికవేత్తలు.. స్పోర్ట్స్​ పర్సన్స్​తో సహా వారి హై-ఎండ్ క్లయింట్స్​తో కలిసి ఫ్యాషన్​ షోలలో హంగామా చేస్తుంటారు. ఇవ్వాల (బుధవారం) ‘ఆంధ్రప్రభ’ స్పెషల్​ ఏంటంటే.. గత వారం మీకు ఇష్టమైన తారలు ధరించిన.. అత్యంత ట్రెండింగ్​లో ఉన్న ఫ్యాషన్ మూమెంట్స్​​ ఏంటో తెలుసుకోవడమే..

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

అందాల తార దిశా పటానీకి తన శరీరాన్ని ఎంత అద్భుతంగా ప్రదర్శించాలో తెలుసు. ఆమె రిస్కీ వార్డ్ రోబ్ చాయిస్​ని ఎంచుకుంటుంది. క్రిమ్సన్ బాడీ-ఫిట్ గౌనులో ఈ మలంగ్ నటి అత్యద్భుతంగా అందాల ప్రదర్శన చేస్తుంది. లేత గోధుమరంగు షూస్​.. దానికి అటాచ్​గా ఓ గౌనును వేసుకోవడం ఆహా అనిపించేలా ఉంది. ఇక అది నెక్‌లైన్‌ను కూడా కలిగి ఉండటం మరో విశేషం.

కరణ్ కుంద్రా నల్లటి రిబ్బన్‌తో మెరిసే బూడిద రంగు కోటులో అందంగా కనిపించాడు. అతను దానిని నల్ల ప్యాంటు, స్నీకర్లతో ధరించాడం మరింత లుక్​నిస్తోంది.

అర్జున్ కపూర్, మలైకా అరోరా ‘‘ది హిందుస్థాన్ టైమ్స్’’ అవార్డుల కార్యక్రంమలో రెడ్ కార్పెట్‌పై తమ డ్రెస్సెస్​ని అద్భుతంగా ప్రదర్శించారు. అర్జున్ తన నీలిరంగు సూట్‌లో హ్యాండ్సమ్​గా కనిపించగా, మలైకా తన బ్లూ సీక్వెన్డ్ ప్యాంట్‌సూట్‌లో మరింతగా మెరిసిపోయింది.

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ అయితే.. షీర్ బ్లాక్ మెర్మైడ్ గౌనుతో బోల్డ్ ఫ్యాషన్​లో కనిపించింది. ఆ గౌను కటౌట్ నెక్‌లైన్​తో పాటు, డీప్-కట్ స్లీవ్‌లు ఉండడం మరింత అందాన్నిస్తోంది. అలాగే నేప్​ వద్ద అధిక చోకర్ యాస ఉంది. దీంతో అది ఆమె శరీరానికి అతికినట్టుగా ఉండి ఆమె ఆకృతులను స్పష్టంగా కనిపించేలా చేస్తోంది. అంతేకాకుండా బాటమ్​లో మత్స్యకన్యలా స్వీప్​ చేస్తుండడం కూడా చూడొచ్చు. ఇక.. పైభాగం బంగారం సీక్విన్స్ తో పాటు నలుపు రంగులో ఉండడం మరింత ఆకట్టుకునేలా ఉంది. బాటమ్​లో అయితే.. మెష్  సెక్షన్స్​తో పారదర్శక లేస్ ఉండడం చూడొచ్చు.

శిల్పా శెట్టి అయితే ఎజ్డ్​ వైన్​లాగా తళ తళ మెరిసిపోతోంది.. ఆమె యూజువల్​గానే మిడ్-పార్టెడ్ పద్ధతిలో ఫ్రీగా వదిలేసిన జుట్టులో ఎంతో అందంగా కనిపించింది.. మరింత గ్లో తెచ్చిన రెడ్​ఆఫ్-ది-షోల్డర్ గౌనును ధరించడంతో అక్కడున్న మిలీనియల్స్ చూపులన్నీ ఆమె వైపు ఉన్నాయడంలో అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement