Monday, November 25, 2024

Mystery | ఆస్ట్రేలియాలో మిస్టరీ వస్తువు.. అంతరిక్షం నుంచి పడిందంటూ ఊహాగానాలు

ఆస్ట్రేలియాలోని జురియన్​ బే బీచ్​లో ఓ మిస్టీరియస్​ ఆబ్జెక్ట్​ కనిపించింది. దాన్ని చూసిన చాలామంది భారతదేశం పంపిన చంద్రయాన్​ మార్క్​3 రాకెట్​కు చెందిన శకలంగా చెబుతున్నారు. అయితే.. దీన్ని ఆస్ట్రేలియన్​ స్పేస్​ ఏజెన్సీ ధ్రువీకరించలేదు. భారత్​ కూడా ఈ వార్తలపై రెస్పాండ్​ కాలేదు. ఈ ఆబ్జెక్ట్​ గురించి ఫొటోలు, కామెంట్స్​తో  ట్విట్టర్​ మోతెక్కిపోతోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ తీరంలో ఇవ్వాల (సోమవారం) ఒక మిస్టరీ వస్తువు కనిపించింది. ఇది భారతదేశం నుండి చంద్రయాన్ -3 ప్రయోగానికి సంబంధించి శకలం కావొచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి.  చంద్రయాన్-3 మిషన్ భారతదేశపు అత్యంత బరువైన రాకెట్. లాంచ్ వెహికల్ మార్క్-III భూమిపై నుంచి నింగిలోకి ప్రయోగించారు. ప్రయోగ పథంలో ఆస్ట్రేలియా ఖండం మీదుగా వెళుతుండగా అక్కడి గగనతలంలో ఈ ప్రయోగం కనిపించడం గమనార్హం.

ఇది LVM-3 నుంచి విడిపోయిన శకలంగా ఒకటి కావచ్చు అనే ఊహాగానాలతో ట్విట్టర్ మోతెక్కిపోతోంది. అయితే.. ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ దీన్ని ధ్రువీకరించలేదు. భారతీయ అంతరిక్ష సంస్థ కూడా ఇప్పటివరకు దీనిపై రెస్పాండ్​ కాలేదు. అయితే.. ఇది భారతదేశం నుండి పాత PSLV ప్రయోగం నుండి పడిపోయిన శకలం కూడా కావచ్చని కొంతమంది అంటున్నారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఉన్న వస్తువుకు సంబంధించి తాము విచారణ చేస్తున్నామని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ తన ట్విట్టర్​ హ్యాండిల్​ ద్వారా వెల్లడించింది. “మేము ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఉన్న ఈ వస్తువుకు సంబంధించిన విచారణలు చేస్తున్నాము. ఆ వస్తువు విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనం నుండి వచ్చి ఉండవచ్చు. మేము మరింత సమాచారాన్ని అందించగల ప్రపంచ ప్రత్యర్ధులతో అనుసంధానం చేస్తున్నాము” అని ఆస్ట్రేలియన్ అంతరిక్ష సంస్థ ట్వీట్ చేసింది.

- Advertisement -

వస్తువుకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలియనందున ఇది ఏమిటనే ఊహాగానాలు మానుకోవాలని, అంతేకాకుండా ఆ వస్తువు నుండి దూరంగా ఉండాలని స్థానికులను అధికారులు కోరారు. కాగా, ఈ వస్తువు 2 మీటర్ల ఎత్తు, దాదాపు 2 మీటర్ల వెడల్పు ఉంది. ఇది రాకెట్ యొక్క మూడో దశగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. భూమిపై ఉన్న వ్యక్తుల భద్రత కోసం బూస్టర్‌లు, అంతరిక్ష నౌక దశలు సముద్రంలో శకలాలుగా పడిపోతాయి.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement