Friday, November 22, 2024

ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలు

దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుంది. బడ్జెట్ 2021-22 ప్రకారం ఏప్రిల్ 1 నుంచి కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. మరికొన్ని వస్తువులు తగ్గనున్నాయి. పాలు, ఏసీ, ఫ్యాన్, టీవీ, స్మార్ట్ ఫోన్లు, విమాన టికెట్లు, కార్ల ధరలు, ముడి సిల్క్, నూలు వస్త్రాల ధరలు, సింథటిక్, లెథర్, వంట నూనె, ఎల్‌ఈడీ బల్బులు, సోలార్ ఇన్వర్టర్లు, మొబైల్ ఛార్జర్ల, లిథియంతో చేసిన ఫోన్ బ్యాటరీల ధరలు పెరగనున్నాయి. పాల ధర లీటర్‌కు రూ.3 పెరిగే ఛాన్సుండగా.. టీవీ మోడల్‌ను బట్టి రూ.2-3వేల వరకు, ఏసీల ధరలు కూడా రూ.2-3 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయంగా దాదాపు అన్ని ఎలక్ట్రానిక్​ కంపెనీలు ఏసీలు, ఫ్రిజ్​ల ధరలు పెంచనున్నట్లు అధికారిక సంకేతాలు కూడా ఇచ్చాయి.

అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించడంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ జాబితాలో పసిడి, వెండి ధరలు తగ్గుతాయి. ప్లాటినం, పల్లాడియం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలతో పాటు.. అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలు, యంత్రాల రేట్లు తగ్గనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement