Wednesday, November 20, 2024

క‌ప్ప‌లకి బోర్ కొడుతుంద‌ట‌

ప్ర‌కృతి ప్రేమికుల్లాగే జంతుప్రేమికులు కూడా ఉంటారు. మూగ‌జీవాల‌పై ఎన‌లేని ప్రేమ‌ని పెంచుకుంటుంటారు ప‌లువురు. ఎక్కువ‌గా ఇళ్ళ‌ల్లో శున‌కాలు లేదా పిల్లులు ఇలా ఎవ‌రికి న‌చ్చిన వాటిని పెంచుకుంటుంటారు. అయితే నీటిలో ఉండే మూగ‌జీవి క‌ప్ప‌.. వీటిని ఎవ‌రైనా పెంచుకుంటారా అంటే ఇదిగో ఈ అమ్మాయి అదే ప‌ని చేస్తుంది. క‌ప్ప‌ని ముట్టుకోవ‌డానికే భ‌య‌ప‌డ‌తారు కొంద‌రు. ఎందుకంటే అది ఎంతో మెత్త‌గా దూదిలా ఉంటుంది కాబ‌ట్టి. ఇక్క‌డ చూస్తోన్న ఈ అమ్మాయి గ్రీన్ క‌ల‌ర్ లో ఉన్న క‌ప్ప‌ల‌ని పెంచుకుంటుంది. ఈమె పేరు గిగి విటాలే.ఈమె వ‌య‌సు 13సంవ‌త్స‌రాలు. ఈమె పెంచుకుంటున్న క‌ప్ప‌ల‌కి పేర్లు కూడా పెట్టిందండోయ్..ఒక క‌ప్ప‌కి మూ, మ‌రో క‌ప్ప పేరు మోచీ. ఐదు నెల‌లుగా ఈ క‌ప్ప‌ల‌తో ఈ అమ్మాయి స్నేహం చేస్తుంది.

వర్షాకాలంలో ఇంటి పెరట్లో రెండు బుల్లి గ్రీన్ కలర్ కప్పల్ని చూసింది ఈ అమ్మాయి. మొదట బయపడింది. తర్వాత ఇష్టపడింది.ఎవరి జోలికీ వెళ్లకుండా తమ బతుకు తాము బతుకుతున్న కప్పల్ని రోజూ చూస్తూ… వాటిపై ఇష్టాన్ని పెంచుకుంది గిగీ. క్రమంగా వాటిని ఫ్రెండ్స్‌గా చేసేసుకుంది.కరోనా సమయంలో ఖాళీ దొరికినప్పుడల్లా నేచర్ వీడియోలను బాగా చూసింది గిగీ. వాటిలో పక్షులు, ప్రాణుల గురించి చాలా తెలుసుకుంది. అవి కూడా మన లాంటి జీవులే అని గ్రహించింది. అలా పుట్టిన ఇష్టాన్నే ఈ కప్పలపై చూపిస్తోంది.కప్పలపై చాలా లోతైన రీసెర్చ్ చేశాక… అప్పుడు వాటిని ఇంట్లోకి తెచ్చి పెంచుకోవడం ప్రారంభించింది. వాటికి రకరకాల ఆహారం పెడుతోంది. వాటిని ఎప్పుడు చూసినా నవ్వుతున్నట్లు ఉంటాయనీ… వాటి ఆకారం కూడా నవ్వు తెప్పిస్తూ ఉంటుందని గిగీ చెబుతోంది.ఈ సందర్భంగా గిగీ ఓ ఆసక్తికర విషయం చెప్పింది.

మనం ఎలాగైతే కంటిన్యూగా ఇంట్లో ఉంటే బోర్ ఫీలవుతామో… కప్పలు కూడా అలాగే ఫీల్ అవుతాయట. అందువల్ల వాటిని తరచూ బయటకు తీసుకెళ్తే… హాయిగా ఫీలవుతాయని అంటోంది. ప్రస్తుతం గిగీ తను ఎక్కడికి వెళ్లినా వాటిని వెంట తీసుకెళ్తోంది. ఇంట్లో కూడా తన పక్కనే వాటిని ఉంచుకుంటోంది. వాటి కోసం చిన్న చిన్న గిన్నెల లాంటి ఏర్పాట్లు కూడా చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ కప్పలతో చాలా వీడియోలు చేసింది గిగీ. రెండు కప్పల్లో మూ తరచూ బయటకు వెళ్లేందుకు రెడీగా ఉంటుందనీ… మోచీ మాత్రం ఇంట్లోనే ఎక్కువగా తిరుగుతుందని అంటోంది.గిగీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 46వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. వారంతా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. మూగ‌జీవాలు క‌దా మంచిప‌ని చేస్తుందంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement