Friday, November 22, 2024

ఒమిక్రాన్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ ప్రభావం.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ల పడింది. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు కుప్పకూలాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1,065 పాయింట్లు కోల్పోయి 55,945 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 319 పాయింట్లు కోల్పోయి 16,656 వద్ద కొనసాగుతోంది. అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ లో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సన్ ఫార్మా, టీసీఎస్ మినహా అన్ని కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్​, రియాల్టీ, ఆటో, పవర్​, ఆయిల్​ అండ్​ గ్యాస్​ రంగాలు దాదాపు 2 నుంచి 3 శాతం పతనమయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement