Tuesday, November 19, 2024

మోదీని అంబేద్కర్​తో పోల్చిన ఇళయరాజా.. సోషల్​ మీడియాలో ట్రోలింగ్​..

ప్రముఖ సంగీత స్వరకర్త ఇళయరాజాపై సోషల్​ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఈ మధ్య రాసిన ఓ పుస్తకంలోని ముందుమాటపై సోషల్​ మీడియాలో ట్రోల్​ అవుతోంది.  “అంబేద్కర్ మరియు మోడీ” అపూ పుస్తకానికి ముందుమాటలో భాగంగా “అంబేద్కర్ మోడీ పాలన గురించి కచ్చితంగా గర్వపడతారు.. అంబేద్కర్​కు మోడీకీ చాలా సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ పేదరికం, అణచివేతను అనుభవించారు. ఈ పుస్తకం ఒక విషయాన్ని హైలైట్ చేస్తుంది. నేను దానిని యువ తరానికి సిఫార్సు చేస్తున్నాను” అని ఇళయరాజా ఆ పుస్తకానికి ముందుమాటగా రాశారు. కాగా, తమిళనాడులోని తిరుమావళవన్ సహా రాజకీయ నేతలంతా ఇళయరాజా వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కాగా, ప్రధాని మోదీపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని సంగీత స్వరకర్త ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ పేర్కొన్నారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ సంగీత స్వరకర్త ఇళయరాజా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులుగా ఇళయరాజాపై వచ్చిన తీవ్ర విమర్శలను తమిళిసై ఖండించారు. ద్వేషపూరిత రాజకీయాలకు బీజం వేసే వారు ప్రధాని మోదీని అంబేద్కర్‌తో పోల్చినందుకు ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ఇళయరాజా ఇలాంటి పరుష పదజాలాన్ని ఎదుర్కోవడం సరైనదేనా? అని తమిళిసై సౌందరరాజన్‌ను ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

“వాక్ స్వాతంత్ర్యం” అంటే మాటల్లోనే ఉంటుందా అని ఆమె ఆశ్చర్యపోయారు. “ఇళయరాజాకు తన ఆలోచనలు చెప్పడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని గట్టిగా చెప్పుకుందాం. మేల్కొలపండి తమిళనాడు’’ అంటూ తమిళిసై ట్వీట్​ చేశారు.  కాగా, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ ఇళయరాజాపై ద్వేషపూరిత ప్రసంగాన్ని ఖండించారు. డీఎంకే పార్టీ తీరును తప్పుపట్టారు.  “ఇళయరాజా సార్ నేరం ఏమిటి? డీఎంకేకు, వారి అహంకార వ్యవస్థకు నచ్చని దృక్పథం ఆయనకు ఉందని? ఆయనను వ్యతిరేకిస్తున్నారా? భారత రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను అనుమతిస్తుంది. ఇళయరాజా సర్‌కి దానిని నిరాకరించడం ద్వారా, DMK తన దళిత వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక స్వభావాన్ని చూపింది”  అని మురుగన్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

సోషల్​ మీడియాలో వస్తున్న విమర్శలతో తాను మాట్లాడినట్లు ఇళయరాజా సోదరుడు తెలిపారు. తన వ్యాఖ్యలను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోనని తనతో ఇళయరాజా అన్నారని ఆయన తెలిపారు. “నేను ఒక సినిమా కోసం కంపోజ్ చేసిన ట్యూన్‌ను ఎవరైనా ఇష్టపడకుంటే.. అయినా నేను దానిని ఎప్పటికీ వెనక్కి తీసుకోను. అదేవిధంగా ప్రధాని మోడీపై నా వ్యాఖ్యలను నేను ఎప్పటికీ వెనక్కి తీసుకోను” అని ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ చెప్పాడు. సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్ట్ లను చూపించేందుకు వెళ్లగా వాటిని చూడ్డానికి కూడా ఆయన అంగీకరించలేదని చెప్పారు. ‘‘పేదల సంక్షేమం కోసం ప్రధాని మోదీ అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు. నేను పుస్తకాన్ని చదివాను. నా ఆలోచనలను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేనెందుకు చింతించాలి. ప్రతి ఒక్కరికీ వారి స్వంత అభిప్రాయాన్ని కలిగి ఉండే హక్కు ఉంది ” అని ఇళయరాజా తనతో అన్నట్టు గంగై అమరన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement