ప్రభన్యూస్ : కరోనా మూలంగా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం ఏప్రిల్ నెలలో సైతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సభ్యునికి ఎప్పటిలా 10 కిలోలు ఉచితంగా అంద చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా వ్యాప్తితో ఓటిపి పద్దతి ద్వారా ఫిబ్రవరి నెల వరకు పంపిణి చేశారు. మార్చిలో కరోనా తగ్గిపోయిందని వేలి ముద్రలతో పంపిణీ చేయించారు. మరి ఉచిత బియ్యం పింపిణీ మ్తాం ఏప్రిల్ నెలకు పోడగించారు. ప్రతి వ్యక్తికి 10 కిలోలు ఉచి తంగా అంద చేయడంతో చాలా వరకు వినియోగదారులు బియ్యం విక్రయిం చడా నికే మొగ్గు చూపుతున్నారని , మరి కొందరు పశువులకు దానగా ఉపయోగి స్తున్నట్లు పలువురు పేర్కోంటున్నారు.
కాగా ప్రభుత్వం వద్ద పేరుకు పోయిన నిల్వ లను వ దిలించుకోవడానికే కరోనా తగ్గినప్పటికి ఉచిత బియ్యం తలా పది కిలోలు ఇస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత తరుణంలో నిత్యావసర వసు ్తవులు ధరలు ఆకాశాన్నంటాయని గతంలో మాదిరి ప్రజలకు ఉపయోగపడే 9 రకాల వస్తు వులు సబ్సిడితో రేషన్ షాపుల ద్వారా అందించాలని వినియోగదారులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..