కొవిడ్ మహమ్మారితో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రేషన్ అందించాయి. అయితే కొద్ది రోజుల నుంచి వాటిని అందించడం మానేయడంతో చాలామంది అధికారులను, ప్రజాప్రతినిధులను అందించాలని కోరుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసినట్టు తెలుస్తోంది. మరో ఆరు నెలల పాటు ఉచిత రేషన్ కొనసాగించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది నిరుపేదలకు లబ్ధి చేకూరనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement