ఇటీవలే స్కూల్ ప్రార్థనలో ఉన్న బాలుడు కార్డియాక్ అరెస్ట్‌కు గురై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. స్కూల్ అయిపోయి.. ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన కుర్రాడు.. కార్డియాక్ అరెస్ట్‌కు గురై మృతిచెందాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలో చోటు చేసుకుంది.
కార్డియాక్ అరెస్ట్ తో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడు స్కూల్ బస్సులోనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అప్పటిదాకా మిత్రులతో కలిసి సరదాగా ఉన్న పిల్లాడు ఉన్నపలంగా కుప్పకూలి మరణించిన వార్త విని తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. ఆ బాలుడి వయస్సు 12 ఏళ్లు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతిచెందిన అతి పిన్న వయస్కుడు అతడే కావొచ్చునని బాలుడిని పరిశీలించిన వైద్యుడు అన్నారు. కోవిడ్-19 తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగాయని ఒక అధ్యయనంలో తేలింది.