పుల్వామా ఘటన జరిగి నేటికి నాలుగు సంవత్సరాలు అయింది. నాటి ఘటనలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లను స్మరించుకున్నారు ప్రధాని మోడీ. వారి అత్యున్నత త్యాగాలను ఎన్నటికీ మరవమంటూ ట్విటర్‌లో వ్యాఖ్యలు చేశారు.
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ‘ఉగ్ర’దాడి జరిగి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ అమర జవాన్లను స్మరించుకున్నారు. 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వాహనాల్లో 2500 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను తరలిస్తున్నారు. ఈ సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందని భారత్ మండిపడగా..దాయాది దేశం ఈ ఆరోపణను ఖండించింది. ఈ క్రమంలో భారత్.. బాలాకోట్‌లోని జైష్-ఏ-మహ్మద్ సంస్థ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. సుమారు 350 మంది ఉగ్రమూకలను మట్టుపెట్టింది. ఆ సమయంలో పాక్‌కు చిక్కిన భారత పైలట్ అభినందన్ వర్తమాన్‌ను పాక్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింన సంగతి విదితమే.
పుల్వామా ఉగ్రదాడికి నాలుగేళ్లు.. జవాన్ల త్యాగాలు మరవలేం.. ప్రధాని మోడీ
Advertisement
తాజా వార్తలు
Advertisement