హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టుతో సిటీలో ప్రయాణం మరింత ఈజీ అయ్యింది. మెట్రోరైల్ మొదటి దశ నవంబర్ 2017లో నాగోల్ – అమీర్‌పేట్- మియాపూర్ రూట్‌తో ప్రారంభించారు. తర్వాత ఎల్ బి నగర్ -అమీర్ పేట రూట్‌ని అక్టోబర్ 2018లో ప్రారంభించారు. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం మార్చి 2019న ప్రారంభమయ్యింది. జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం ఫిబ్రవరి 7, 2020 నుండి అందుబటులోకి వచ్చింది.
ఈ రూట్ ప్రారంభంతో మెట్రో మొదటి దశలో 72 కి.మీ.లకు గాను 69 కి.మీ. మార్గం అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. హైదరాబాద్ మెట్రో దేశంలో రెండో పెద్ద మెట్రో గా గుర్తింపుపొందింది. కాగా, మెట్రో రైలు ప్రారంభమయ్యి నేటికి నాలుగేండ్లు పూర్తి అయిన సందర్భంగా ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రయాణికులకు గ్రీటింగ్స్ తెలుపుతూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..