హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యం ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో ఈ బై ఎలక్షన్స్ జరుగుతోంది. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటెలకు ధీటుగా టీఆర్ఎస్ కూడా హోరాహోరిగా ప్రచారం చేస్తోంది. ఈ ఉపఎన్నిక కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ ఉన్నట్లు జరగబోతున్నాయి. ఈ ఉపఎన్నికకి మొత్తం 61మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే హుజూరాబాద్‌లో రాజేందర్ పేరుతో మొత్తం నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ముగ్గురు చివరి రోజున నామినేషన్లు వేశారు.
వారి ఇంటి పేర్లు కూడా ఈటల మాదిరిగానే “ఈ” అనే అక్షరంతో ఉన్నాయి. ఈమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా) ఈసంపల్లి రాజేందర్ (న్యూ ఇండియా పార్టీ), ఇప్పలపల్లి రాజేందర్ (ఆల్ ఇండియా బిసి ఓబిసి పార్టీ)లు నామినేషన్లు సమర్పించారు. దీంతో ఈటల రాజేందర్ శిబిరంలో కొంత అలజడి మొదలైంది. నలుగురు పేర్లు ఒకే రకంగా ఉండటంతో హుజురాబాద్ ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉందని ఈటల సన్నిహితులు అంటున్నారు. ఓటర్లను పక్కా గందరగోళానికి గురిచేసేందుకే టీఆర్‌ఎస్ ఈ పనికి పూనుకుందని ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Inida Corona: 206 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు