రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులను నామినేట్ చేసినట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వీరిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి కథా రచయిత అయిన విజయేంద్రప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఉన్నారు. మరో వ్యక్తిని స్పోర్ట్స్ పర్సన్ అయిన పీటీ ఉషా, వీ హెగ్డే ఉన్నారు. వీరి గురించి ప్రధాని ట్వీట్లో వెల్లడించారు. తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వీరిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేయడం విశేషం. రాష్ట్రపతి కోటాలో ప్రముఖులను నామినేట్ చేస్తున్నట్టు ప్రధాని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Big Breaking: రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేట్.. రాజమౌళి తండ్రికి చాన్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement