Friday, November 22, 2024

బ్రిట‌న్ లో వారానికి నాలుగురోజుల డ్యూటీ.. లాభాల‌తో దూసుకుపోతోన్న కంపెనీ

వారమంతా ప‌ని చేసి వారానికి ఒక‌రోజు సెల‌వు వ‌స్తేనే గెంతులు వేస్తాం..అటువంటిది వారంలో నాలుగు రోజుల ప‌ని అంటే ఎక్క‌డ లేని హుషారు వ‌స్తుంది. అయితే బ్రిటన్ లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసి చూశారు. ఫలితాలను చూసిన కంపెనీలు తిరిగి తాము ఐదు రోజుల పని విధానానికి వెళ్లబోమని తేల్చి చెబుతున్నాయి. అంత చక్కని ఫలితాలు ఈ విధానంలో కనిపించాయి. ఈ అతిపెద్ద ప్రయోగాత్మక విధానంలో చాలా కంపెనీలు భాగమయ్యాయి. మెజారిటీ కంపెనీలు ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నాయి. తిరిగి పాత విధానానికి వెళ్లడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని కంపెనీలు అంటున్నాయంటే, ఫలితాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

అడ్వొకసీ గ్రూప్ ఈ ప్రయోగాత్మక విధానాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించింది. నాలుగు రోజుల పని విధానం వల్ల నిద్ర, ఒత్తిడి సమస్యలు ఉండడం లేదని, వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యం మెరుగుపడినట్టు ఉద్యోగులు చెప్పారు. పైగా పనిలో ఉత్పాదకత కూడా పెరిగింది. వివిధ రంగాల నుంచి 61 కంపెనీలు ఈ ప్రయోగాత్మక నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేసి చూశాయి. 3,000కు పైగా ఉద్యోగులు పాలు పంచుకున్నారు. మొత్తం మీద 91 శాతం కంపెనీలు నాలుగు రోజుల పని విధానాన్ని ఇక ముందూ కొనసాగిస్తామని చెప్పాయి. 4 శాతం కంపెనీలు ఏటూ తేల్చుకోలేకున్నాయి. మరో 4 శాతం కంపెనీలు తిరిగి ఐదు రోజుల విధానానికి మారిపోతామని చెప్పాయి.ఏది ఏమ‌యినా నాలుగు రోజుల ప‌నివిధానంతో ఉద్యోగుల్లో ఉత్సాహం క‌నిపిస్తుంద‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement