గంగా ఎక్స్‌ప్రెస్ వే కంప్లీట్ అయితే పరిసర ప్రాంతాల ప్రజలకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈరోజు షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని .. సుమారు 600 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి రూ.36 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు.
గంగా ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపనతో ఆ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలైన మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహ, సంభాల్, బదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నవ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ ప్రజలకు ప్రధాని అభినందనలు తెలిపారు. గంగా ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే పలు కొత్త పరిశ్రమలు రానున్నట్టు ఆయన చెప్పారు. దీంతో స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.