సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో మెసేజ్ లు ఫార్వార్డ్ చేయడంపై పరిమితి తీసుకువచ్చింది. ఇకపై గ్రూపులో ఫార్వార్డ్ మెసేజ్ లను ఒకసారికి మించి ఫార్వార్డ్ చేయడం కుదరదు. యూజర్లు ఫార్వార్డ్ మెసేజ్ లను ఒక గ్రూపు కంటే మించి ఇతర గ్రూపులకు ఫార్వార్డ్ చేయడాన్ని ఈ ఫీచర్ అడ్డుకునేలా తీసుకొచ్చింది వాట్సాప్ సంస్థ..
ఇక గ్రూపుల్లో స్పామ్ మెసేజ్ లు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి వాట్సాప్ ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికైతే బీటా వెర్షన్ వాడుతున్న కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది.