హైదరాబాద్, ప్రభన్యూస్: ప్రజల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫోర్టిఫై డ్‌పై దృష్టి సారించింది. ఇందుకోసం యాసంగి, వానా కాలంలో ఇచ్చే ధాన్యంలో ఫోర్టిఫైడ్ రైస్‌ను ఇవ్వాలని ఈ మేరకు రాష్ట్రం నుంచి సుమారు 15లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ ఇవ్వాలని భారత ఆహార సంస్థ తెలంగాణను కోరింది. కానీ ప్రస్తుతానికి తెలంగాణ అవసరాలకూ బయట ప్రాంతాల నుంచే ఫోర్టిఫైడ్ రైస్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి కూడా పోషకాలతో కూడిన ధాన్యాన్ని కావాలని ఎఫ్‌సీఐ కోరడంతో ఆ మేరకు కాకపోయినా సుమారు 3లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఇచ్చేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సాధారణ బియ్యం ఫోర్టిఫైడ్‌గా మారిన తరువాత వాటినే అచ్చంగా బోజనంలో తిన కూడదు. కిలో సాధారణ బియ్యంలో పది గ్రాముల ఎఫ్ఆర్కే (ఫో ర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్)ను కలిపి వండుకోవాలి. దీని ప్రకారం క్వింటాలు బియ్యానికి కేవలం కిలో పోర్టిఫైడ్ రైస్ సరిపోతా యి.
ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహరాల శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో సూచించింది. ఈ పోర్టిఫైడ్ రైస్‌లో ముఖ్యంగా ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్‌తో పాటు విటమిన్ బి-12 పోషకాలను కలుపుతారు. ఈ విటమిన్లతో కూడిన బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడంతో రోగనిరోధక శక్తి పెరుగడంతో పాటు రక్తహీనత, విటమిన్లలోపం తగ్గనుంది. ప్రస్తుతం భారతదేశంలో ఆకలిసూచిలో కింది స్థానంలో ఉండడంతో పాటు ప్రస్తుతం ఆహారంగా తీసుకుంటున్న బియ్యంలో ఎలాంటి పోషకాలు ఉండకపోవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సివస్తోంది. దీనికి స్వస్తి పలికి పోషకాలతో కూడిన బియ్యాన్ని ప్రజలకు అందిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రం నుంచి ఫోర్టిఫైడ్ రైస్ కావాలని ఎఫ్‌సీఐ కోరింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్ అధారిటీ ఆఫ్ ఇండియా) ప్రకారం సాధారణ బియ్యానికి అవసరమైన మోతాదులో మైక్రో న్యూట్రియెంట్స్ (సూక్ష్మ పోషకాలు అంటే ఐరన్, డి విటమిన్ లాంటి తదితర పోషకాల)ను జోడించడంతో అవి ఫోర్టిఫైడ్‌గా మారుతాయి. ఈ ఫోర్టిఫైడ్ ప్రక్రియకు మొత్తం రెండు రకాలున్నాయి. వాటిలో మొదటిది కోటింగ్ దీని ప్రకారం బియ్యంతో పాటు గోధుమలు తదితర ఆహార పదార్థాలకు సూక్ష్మపోషకాలను ప్రత్యేక యంత్రాల ద్వారా కోటింగ్ వేస్తారు. రెండవది డస్టింగ్ ఈ ప్రక్రియలో బియ్యాన్నే పిండిగా మార్చి అందులో అవస రమైన మేరకు పోషకాలను కలుపుతారు. అనంతరం ఆ పిండిని నీటితో కలిపి యంత్రాల ద్వారా మళ్లి బియ్యపు గింజలుగా మారుస్తారు. ఇలా తయారైన బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ (ఎఫ్ఆర్కే) అని పిలుస్తారు. ఈ బియ్యం తినేందుకు వీలుగా 5 మిల్లిమీటర్ల గింజపొడవు, 2.2 మిల్లి మీటర్ల మందం ఉండడంతో పాటు ఇంతకు మించరాదని కూడా కేంద్ర ఆరోగ్యశాఖ జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ బియ్యం యొక్క జీవితకాలం కేవలం 12 నెలలు మాత్రమే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital