Friday, November 22, 2024

జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్‌ టేలర్‌పై మూడున్నరేళ్లపాటు నిషేధం..

జింబాబ్వే మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ మూడున్నరేళ్లపాటు నిషేధం విధించింది. భారత్‌లో ఓ బుకీ నుంచి స్పాట్‌ఫిక్సింగ్‌ కోసం నగదును తీసుకున్నట్లు టేలర్‌ ప్రకటించాడు. కానీ తను ఫిక్సింగ్‌కు పాల్పడలేదని తెలిపాడు. ఈనేపథ్యంలో ఐసీసీ అతడిపై చర్యలకు పూనుకుంది. అన్ని ఫార్మాట్ల నుంచి మూడున్నర సంవత్సరాలపాటు దూరంగా ఉండాలని ఐసీసీ ఆదేశించింది.

ఇటీవల బ్రెండన్‌ టేలర్‌ మాట్లాడుతూ 2019లో భారత వ్యాపారవేత్తతో జింబాబేలో టీ20 లీగ్‌ ప్రారంభించేందుకు చర్చలు జరిపాడు. వ్యాపారవేత్తకు సంబంధించిన మనుషులు తనకు కొకైన్‌ ఆఫర్‌ చేస్తే తీసుకున్నాను అని..అనంతరం వారు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడాలని బెదిరించారని టేలర్‌ వెల్లడించాడు. అయితే తను ఫిక్సింగ్‌కు పాల్పడలేదని కానీ ఐసీసీకి చెప్పడంలో జాప్యం చేశానని పేర్కొన్నాడు. దీంతో ఐసీసీ అతడిపై నిషేధాన్ని విధించింది. టేలర్‌ 2004 నుంచి 2021 మధ్య జింబాబే తరఫున 284 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 9,938 పరుగులు సాధించాడు. వీటిలో 17సెంచరీలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement