Saturday, November 23, 2024

Breaking: లెజండరీ లీడర్​ ములాయంసింగ్​ ఇక లేరు.. ఇవ్వాల తెల్లవారుజామున కన్నుమూత

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇవ్వాల (అక్టోబర్ 10, సోమవారం) తెల్లవారుజామున మరణించారు. అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఐసియుకి తరలించారు. సమాజ్‌వాదీ పార్టీ ట్విటర్ హ్యాండిల్‌లో పంచుకున్న సంక్షిప్త ప్రకటనలో అఖిలేష్ యాదవ్   “నా గౌరవనీయమైన తండ్రి,అందరి నాయకుడు ఇక లేరు”అని పేర్కొన్నారు..

82 ఏళ్ల సమాజ్‌వాదీ పార్టీ పితామహుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. మేదాంత ఆసుపత్రిలో అంతర్గత వైద్య నిపుణుడి పర్యవేక్షణలో ఉన్నారు. సింగ్ యూరినరీ ఇన్ఫెక్షన్‌తో కూడా బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అక్టోబరు 2న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకి తరలించారు. ములాయం కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన భార్య డింపుల్‌తో కలిసి గురుగ్రామ్ ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్న  మేదాంత హాస్పిటల్ వెటరన్ లీడర్ల పరిస్థితి చాలా విషమంగా ఉందని..  అతను లైఫ్​ సపోర్ట్​మీద ఉన్నాడని  హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక.. సోమవారం ఉదయం 8:15 గంటల ప్రాంతంలో ములాయం సింగ్ యాదవ్ తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement