కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆయన కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మొత్తం 11 మంది కేంద్ర మంత్రులను కేబినెట్ నుంచి తొలగించారు. వారిలో రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. కేబినెట్ విస్తరణకు కొద్ది గంటల ముందే రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో నే కేంద్ర ప్రభుత్వం ఆయనను తమిళనాడు గవర్నర్ గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా బన్వర్ లాల్ పురోహిత్ వ్యవహరిస్తున్నారు.
ఇది కూడా చదవండిః కార్యకర్త చెంప పగలకొట్టిన పీసీసీ అధ్యక్షుడు