తన తాత..ప్రముఖ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ మృతి చెందారని ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ ప్రకటించారు. సుఖ్ రామ్ వయసు 94 సంవత్సరాలు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 7వ తేదీన న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వైద్యం కోసం చేరారు. అదేయు తాత ఫోన్ ఇక నుంచి మోగదు (అల్విదా దాదాజీ; అభి నహీ బజేగీ ఫోన్ కీ ఘంటి)’’ అని పేర్కొన్నారు. దీంతో పాటు తాతతో కలిసి కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే ఆయన ఎప్పుడు చనిపోయారనే విషయాలన్ని ఆ పోస్ట్ లో స్పష్టంగా తెలుపలేదు. సుఖ్ రామ్‌కు మే 4వ తేదీన మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అతడిని మండిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మే 7వ తేదీన ఢిల్లీకి తరలించారు. అయితే ఢిల్లీ ప్రయాణించడానికి అవసరమైన హెలికాప్టర్ ను హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ అందించారు.
సుఖ్ రామ్ 1993 నుండి 1996 వరకు కేంద్ర సహాయ, కమ్యూనికేషన్స్ (స్వతంత్ర) మంత్రిగా ఉన్నారు. ఆయన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా పని చేశారు. మొత్తంగా ఐదుసార్లు విధానసభ ఎన్నికల్లోనూ, మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆయన 1963 నుండి 1984 వరకు మండి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించాడు. హిమాచల్ ప్రదేశ్‌లో పశుసంవర్ధక మంత్రిగా ఉన్న సమయంలో జర్మనీ నుండి ఆవులను తీసుకువచ్చారు. ఇది రాష్ట్ర రైతుల ఆదాయాన్ని పెంచడానికి దారితీసింది. . ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 7వ తేదీన న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వైద్యం కోసం చేరారు. ఆయన మృతి చెందిన విషయాన్నిడడమనవడు ఆశ్రయ్ శర్మ ప్రకటించారు.