తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనా చారి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ కు తమ ప్రతిపాదన పంపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రుల సంతకాలతో కూడిన ఫైల్ ను రాజ్ భవన్ కు తెలంగాణ కేబినేట్ పంపింది.
ఈ రోజు మధ్యాహ్నం లోపు గవర్నర్ తమిళసై ఈ ఫైల్ పై సంతకం పెట్టనున్నారని సమాచారం. కాగా, గతంలో టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఆ ఫైల్ పెండింగ్ పెట్టడంతో కేసీఆర్ సర్కార్.. తాజాగా మధుసూదనా చారి పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..