గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని నామినేట్ అయ్యారు. ప్రభుత్వం పంపిన సంబంధిత ఫైల్‌పై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సంతకం చేశారు. అయితే, అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది.
కాగా, సిరికొండ మధుసూదనాచారి టీఆర్ఎస్ పార్టీ అవిర్భావం నుండి సీఎం కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. కేసీఆర్ సన్నిహితులలో ఒకరిగా ఆయనకు పేరుంది. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ గా మధుసూదనాచారి పని చేశారు. 2014 నుంచి 2018 వరకు శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో భూపాలపల్లి నియోజకవ్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన స్పీకర్ అయ్యారు. అయితే 2018లో మరోసారి భూపాలపల్లి నుంచి బరిలో నిలిచిన మధుసూదనాచారి.. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే, అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital