మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మద్దతు పలికారు. ఈ రోజు సీఎం కేసీఆర్ కు దేవెగౌడ ఫోన్ చేసి ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా దేవగౌడ మాట్లాడుతూ.. ‘‘ రావు సాబ్.. మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. పెద్ద యుద్దమే చేస్తున్నారు.. మతతత్వ శక్తుల మీద ఎవరైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా వుంటాం.. మీ యుద్దాన్ని కొనసాగించండి.. మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది.’’ అంటూ దేవగౌడ తన మద్దతును ప్రకటించారు. కాగా.. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. దేవగౌడకు తెలిపారు. అయితే కేంద్ర బడ్జెట్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital