కేరళలో ఆయుర్వేద వైద్యం ఎంతో ప్రసిద్ధిగాంచిన సంగతి తెలిసిందే. ఈ విషయం మరోసారి రుజువయింది. కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా , కుమారై రోస్ మేరీ ఒడింగాకి బ్రెయిన్ ట్యూమర్ రావడంతో కంటిచూపు పోయింది. దాంతో జర్మనీ, ఇజ్రాయెల్,చైనా వంటి ఎన్నో దేశాల్లో ఆమె కంటిచూపు కోసం పలు ఆసుపత్రులకి తిప్పారు. అయినా కంటిచూపు రాలేదు. దాంతో కేరళలో ఆయుర్వేత చికిత్సని ప్రారంభించారు. నాలుగు నెలలు ఆయుర్వేద చికిత్స పొందిన అనంతరం ఆమెకి కంటిచూపు వచ్చింది. కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా ఆ దేశంలో మంచి ఆదరణ ఉన్న నేత. ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు అధికంగా ఉన్న నాయకుడు. తాను త్వరలోనే కెన్యా అధ్యక్షుడు అయిన తర్వాత తమ దేశంలోనూ శ్రీధరీయం తరహా ఆయుర్వేద చికిత్స అందించే వసతులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఈ ఆయుర్వేద చికిత్సను తమ దేశంలోనూ ప్రారంభిస్తామని చెప్పారు. కాగా, కంటిచూపును తెప్పించే ఆయుర్వేదం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఈ చికిత్స తీసుకున్న నాలుగు నెలల్లోనే ఆమెకు కళ్లు మళ్లీ కనిపించడం మొదలయ్యాయి. ఇప్పుడు ఆమె ఫోన్‌లోని టెక్స్ట్ మెసేజెస్ కూడా స్పష్టంగా చూడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ చికిత్స తీసుకున్న తర్వాత ఆమె తిరిగి కెన్యా వెళ్లిపోయారు. చికిత్స అందించినవారికి కృతజ్ఞతలు తెలుపడానికి, అదే విధంగా ఆయుర్వేద చికిత్సలో ఫాలోఅప్ టెస్టుల కోసం ఆమె తండ్రి, కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగాతో రోస్‌మేరీ ఒడింగా భారత్‌కు ఈ నెల 7వ తేదీన వచ్చారు. ఈ నెల 28వ తేదీ వరకు భారత్ లోనే ఉండనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..