తెలంగాణలో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పార్టీకి రాజీనామా చేసి షర్మిల చెంతకు చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కొండా బిజెపిలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన చిన్నా రెడ్డికి నష్టం జరగకుండా ఉండాలని పోలింగ్ జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొదట టిఆర్ఎస్ లో చేరి చేవెళ్ల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో యాక్టివ్ గానే ఉండేవారు.